లోకవృత్తిన్ సదా లుప్తమై పోవుచున్
30, నవంబర్ 2022, బుధవారం
లుప్తమై
లోకవృత్తిన్ సదా లుప్తమై పోవుచున్
శూన్యం
పోరాటమ్మే బ్రదుకు పథమై పూర్వకర్మాశ్రితమ్మై
ఆరాటమ్మే పలుకు పదమై యంతరంగాశ్రితమ్మై
సారమ్మేమో యెఱుగగలిగే సత్త్వమే శూన్యమైనన్
భారమ్మెంతో! పయనమగుదున్ పంతమున్ వీడకుందున్
--లక్ష్మీదేవి
మందాక్రాంతము
29, నవంబర్ 2022, మంగళవారం
అంతయు
ధనములు నాస్తిపాస్తులును దండిగ నున్నను, లేని చోటులన్
మనమున సంకటమ్ములను మాయము చేయగ శక్తి లేనివీ
జనుమలు మానవాళివని సంయమమొప్పగ నుండనోపు, కా
దనగల వీలులేదనగ నంతయు మార్చు సమర్థులేరిటన్?
-- లక్ష్మీదేవి
చంపకమాల
ధాత్రి
వనిపచ్చందనమెల్ల పత్రములలో భాస్వంతమై చెల్గెనో
ఘననీలమ్ములునల్లదో గగనమై గాఢమ్ముగా వెల్గెనోమినుకుందెల్పుల ఫేనమా కడలిపై మెమ్మేటిగా చిందెనో
కనువిందైనవి వన్నియల్ సొబగు సింగారమ్ములిద్ధాత్రిపై.
28, నవంబర్ 2022, సోమవారం
నిర్వేదము
దుర్వారమ్ము నిరాశ జీవనమునన్ దుఃఖంపు సాంగత్యమై
గర్వమ్మెల్ల నడంగఁజేయును సదా కల్లోల మందుంచుచున్నిర్వేదమ్మును సాధనమ్ముఁగ, నిదో నేనిట్లు సాగింతు నా
నిర్వాణంపు ప్రయాణమున్ ధరణిలో నిక్కంపు ధైర్యమ్ముతో.
కృష్ణ గాథ
ఋజ్వికాని చరిత్రమైనది కృష్ణ గాథ ల గుచ్ఛమై
యుజ్వలోరస మాధురీగుణయుక్తమై వ్రజవాసమైప్రజ్వలించెను సాంద్రనీలము భక్తి కావ్యములందు, మా
హోజ్వలమ్ముగ మానవాళిని యుద్ధరించెడు కాంతియై.నీలమణి
ఉజ్జ్వల నీలమైన మణి నూరక పేరు వినంగనెంతగా
నుజ్జ్వలమైన భావనలు, నుద్ధృతియుం గలుగంగఁ; జాలునే
యుజ్జ్వల సూర్యబింబములనొప్పుగ మించిన కాంతిముందు? నీ
యుజ్జ్వలితమ్ములున్ మిణుగులో, మరి యంతకుఁ జాలవోకదా!
--లక్ష్మీదేవి
ఉత్పలమాల
27, నవంబర్ 2022, ఆదివారం
అజ్ఞానప్రదర్శన
ప్రజ్ఞాపాటవమంచు నేది తన లోపమ్మైన, నెంతైన తా
నజ్ఞానమ్మున నుండుటే యెఱుగకున్నట్లైన, పంతమ్ముతో
విజ్ఞానంపు ప్రదర్శనాభిరుచితో పేట్రేగి పోచున్నచో
నే జ్ఞానుల్ వివరించి చెప్పగలవారింకేమి కానున్నదో!!
--లక్ష్మీదేవి
శార్దూలవిక్రీడితము.
సద్ధర్ములు
కర్మలనాచరించుటను కామితమెయ్యది లేని తీరులో
నిర్మమమౌ విధమ్మునొక నిక్కపు జీవనమెల్ల సాగగానిర్మలమైన మానసము, నీమము నాచరణమ్మునుండు స
ద్ధర్ములు నెవ్వరుందురని ధాత్రియు నిత్యము చూచుచుండునో?
25, నవంబర్ 2022, శుక్రవారం
నిల్వగలేక
గెల్వగ వాదులాడరు, నొకింతగ జాలినిఁ బొంది వారిపై.
24, నవంబర్ 2022, గురువారం
కాలము
విశ్వములోనిమాయలను వేడుకఁ జూచుచుఁ బొద్దుఁ బుచ్చుచున్
నశ్వరమైన వింతలను నమ్మగఁ జాలక చర్చఁ జేయుచున్నిశ్వసనమ్ములందుననె నెట్టుచునుందుము కాలమున్ కదా!
యశ్వపు వేగమందుకొని యందక నెట్లది చెల్లిపోవునో!
22, నవంబర్ 2022, మంగళవారం
నీలిసముద్రం
మనోసముద్రమంతరంగమౌనమై గభీరమై.
20, నవంబర్ 2022, ఆదివారం
మాలిక
పదములు వెల్లువై యురుకఁ బద్యము కాదు, సుమా రసజ్ఞునిన్
హృదయములుల్లసమ్మలర హృద్యము, స్వారసబంధురమ్ముగా
ముదమునొసంగగావలయు, ముచ్చట మీర ధ్వనించి వేడుకల్
సదమలమైన భావఝరిసంపదతోడ రచింప, మెల్లగా
మృదువగు రీతిగా నడచి మేలిమి శైలిని సాగుచుండ, నె
ట్లొదుగునొ యట్టి తీరుననె యుద్ధతిఁ జూపి, యడంగి, యే స్థితిన్
కదలగనొప్పునో తెలిసి కందువ తీర్చినఁ, బాఠకాదులం
జదువగఁ జేయు, పద్యముల సౌరును నింపుగఁ గాంచి విజ్ఞతన్
కొదవలఁ దోషలోపములఁ గూర్పుగ నేర్పుగ నెత్తి చూపుచో
చెదరని యాత్మ స్థైర్యమున సిద్ధము కావలె, నాణ్యమైనదై
కుదురగు పద్యమల్లుకొన ఘుమ్మను పువ్వులఁ గూర్చినట్టుగా
చదువుల తల్లి చల్లనగు చక్షువుదీవనలిచ్చి మెచ్చగా.
--లక్ష్మీదేవి
చంపకమాలిక
19, నవంబర్ 2022, శనివారం
నిర్లక్ష్యం
దుర్లంఘమునై యిపుడిది దుర్దినమయ్యెన్
18, నవంబర్ 2022, శుక్రవారం
విరాగమే
బిరాన కాలమెల్ల చెల్లు భిన్నమైన రీతిలో
17, నవంబర్ 2022, గురువారం
నిస్తారము
న్యస్తమ్మట్లీ మనమునిడగా నాథుడెట్లైన రాడో!
పఠనము
పఠనములో తోడునిలుము పథమునుఁగనఁగా
16, నవంబర్ 2022, బుధవారం
నిర్వేదం
శర్వాణీసుతుడై చెలంగునతనిన్ సద్బుద్ధినిమ్మంచు నేఁ
బర్వమ్మందున నర్చనల్ సలుపగా ప్రార్థించగా నిచ్చెనాదూర్వాయుగ్మముతోగణేశుడు సదా తోషమ్మునందున్ గదా!
నిర్వేదమ్మున వ్యర్థమంచు తలతున్నేడిట్లదేమైనదో!
అందము
చిత్తడినేలలోనరక జృంభణమొప్పగ దున్నినాటినన్
విత్తులు మొక్కలై ఎదిగి పెంపులు మీరగ పండినంత, కొంగ్రొత్తగ కానవచ్చె ,చిరు గువ్వలు పువ్వుల వోలె వాలగా
చిత్తరువన్న తీరునది చిందినదందము కన్నువిందుగా.
మాధురులు
కదళీపాకమువోలె మాధురులు పొంగారంగ దీవింపుమా!
14, నవంబర్ 2022, సోమవారం
దీక్ష
చదువుల సారమెల్లఁగన శక్తినొసంగుము శారదాంబికా!
కదలని దీక్షనిచ్చి నను కంకణబద్ధగ నుండనిమ్ము, నీకదనపు లోకసీమఁ గల కయ్యములంబడి యేగు తత్వమున్
వదలగఁజేయుమందు, నొగి భవ్యపథమ్మునుఁజూపమందు నిన్.
కాలము
కాలము చెల్లఁజేయు మన గందరగోళములెల్లతీరులన్
మేలిమియైనరీతులను మించినపద్ధతి నేర్పుచుండు, పోజాలని కష్టమైన కొనసాగెడు బాధలనైన మాయగా
తేలిక చేసిపోవునిది, దివ్యమహౌషధమియ్యదొక్కటే
జ్వాల
ఫాలాలంకృత దీపమై వెలిగితే భవ్యార్చనాదీక్షలో.
13, నవంబర్ 2022, ఆదివారం
సంధ్యా సమయం
వింధ్యాపర్వత శ్రేణిలో యడవిలో భృంగాళితోఁ బాటుగా,
సంధ్యారాగముఁదీసెనీ యిరులహా సంగీతమైతోచగా,సంధ్యాదీపము చంద్రుఁడై వెలిగెనే సౌందర్యమై, యచ్చటే
వింధ్యావాసిని పెట్టెనో ప్రమిదలో వెల్గొందు దీపమ్ముగా.
11, నవంబర్ 2022, శుక్రవారం
కొత్త వృత్తము
పుస్తకమ్ములందొక్కటైన నేఁ బూర్తిచేయగా జన్మచాలునా?
మస్తకమ్మునన్నిల్చియుండగా మర్మమైనదౌ యర్థమందునా?
విస్తరమ్ముగా నెల్ల రీతులన్ విద్య సంపదై నాకు దక్కునా?
అస్తమించుచో జీవనమ్ము, నీ యాత్మతృప్తిగా నిష్క్రమించునా?
--లక్ష్మీదేవి
9, నవంబర్ 2022, బుధవారం
లయగ్రాహి
మాలి యొకడుండెనట, పూలతలఁబెంచెనట, మేలి విధ గంధములు గాలులను నిండెన్.
కేలఁగొని యల్లుకొని మాలలుగ కూర్చుకొని కాలినడ కోవెలకు మాలి చనె భక్తిన్.బాలలును పెద్దలును వేలుపుల పూజలనుఁ గోలములనాడిరట, చాల కనువిందుల్.
రాలినవి పూలచట తేలినవి వాగునల సోలినవి వాడినవి చాలునట జన్మల్.