శ్రీచక్రాంకితమై చెలంగు గుడిలో శృంగేరి గ్రామమ్ములో
రోచిశ్శోభల చిద్విలాసములతో రుద్రాణి రూపమ్ముతో
ప్రాచీనామృత కావ్యవస్తునిధిగా ప్రఖ్యాత తేజమ్ముతో
నా చేతమ్ముల నిల్చితీవు, లలితానామాఖ్యవై పావనీ!
శ్రీచక్రాంకితమై చెలంగు గుడిలో శృంగేరి గ్రామమ్ములో
రోచిశ్శోభల చిద్విలాసములతో రుద్రాణి రూపమ్ముతో
ప్రాచీనామృత కావ్యవస్తునిధిగా ప్రఖ్యాత తేజమ్ముతో
నా చేతమ్ముల నిల్చితీవు, లలితానామాఖ్యవై పావనీ!
కలలో, బంగరు మెరుపుల
శిలలో, తెలితెలి నురుగులఁ జిందుచు నురికే
యలలో, శ్రద్ధనుఁ గలిగిన
నిలలో నినుఁగను మనములనింపుగనిమ్మా!
-లక్ష్మీదేవి
లలనా! శ్రీయుత పాదశోభితములై, లావణ్యమై యొప్పు ని
గ్గులతో, తోషము నింపు పల్కులమరంగూర్పంగదే పద్యముల్,
తొలి నేఁ జేసిన పుణ్యమై పలుక, నిర్దోషంపు సత్కావ్యముల్,
తిలకించంగదె యొక్కమారు నను,నో దివ్యాంబకా యంబికా!
- లక్ష్మీదేవి
మత్తేభవిక్రీడితము
మీటను నొక్కి చక్రమును మెల్లగ త్రిప్పుచు శాంతచిత్తమున్,
బాటనుఁ జూచుకోగలిగి, బాధ్యతఁగల్గిన చోదకత్వమున్,
సాటి మనుష్యులెవ్వరికి సంకటమీయని సంయమమ్ముతో,
దీటగు జాగరూకతను తేఁకువ మీరగ సాగుచుండుమా!
-లక్ష్మీదేవి
శ్రీచక్రమ్మందు సింహాసినిగ, ముఖకళల్ శ్రీల రాజిల్లు రాజ్ఞీ!
వీచీశోభాయుతమ్మై వెలయు కురుల సుప్రీతమై యొప్పు దేవీ!శ్రీచక్రాంకితమై చెలంగు గుడిలో శృంగేరి గ్రామమ్ములో
రోచిశ్శోభల చిద్విలాసములతో రుద్రాణి రూపమ్ముతోలోకోత్తరులఁగని లోకంపునుపమల
లోకువఁగట్టగా లొసుగు గాదె?విపంచిరాగమాలపించి విందుఁగూర్చుమోయి నీ
వు పంచచామరమ్ము బాడవోయి హాయిహాయిగా
ప్రపంచమెల్ల నాలకించి పాడునోయి తోడుగా
తపించుచున్న మానసమ్ము తన్వినందునందు నే
-లక్ష్మీదేవి
పంచచామరము.
సీ . మిత్రులనినవారు మేలుఁగోరి పలుకు
మాటలందున శ్రద్ధ మనకుఁగలుగు
శత్రువులంటివా, జరుగు కీడు నెఱుగ
మాటలందున శ్రద్ధ మనకు వలయు
ఆత్రుతఁ గనకుండ, హసియించి పోఁద్రోలు
చేతల నలసత చేటుఁ గూర్చు
చిత్రమేమొ, యదెట్టి చీకు చింతయు లేని
నడతఁగలుగు మన్కి నయము తుదకు.
ఆ. నెంచి యెంచి మనిన నెట్టి కీర్తి దొరకు?
భ్రమలు తొలగు పొద్దు పలకరింప,
వెఱ్ఱియగుటె మిగులు. విబుధజనులనుండి
విన్నమాటలివియె విశ్వమంత.
-లక్ష్మీదేవి.
సీసపద్యము.
#నాపద్యాలు
#ఆనందాలు
😊😊