* వారు సెలవిచ్చినారు/వారి సెలవైంది =వారు చెప్పినారు/ఆనతిచ్చినారు
* వీరు సెలవు పుచ్చుకున్నారు = వీరు బయల్దేరినారు;
సెలవిప్పించండి = ఆజ్ఞ/అనుమతి ఇప్పించండి (బయల్దేరడానికి)
సెలవు అంటే ఆజ్ఞ, అనుమతి మొదలైన అర్థాలున్నందున ఈ రెండు సందర్భాల్లోనూ
వాడడం జరుగుతుంది.
---
మనము ప్రస్తుతం విరివిగా వాడుకునే సందర్భం ఒక్కటే.
సెలవులు = పని కి విరామదినములు. ఇది కూడా ఇప్పుడు లీవులు, హాలీడేస్ అంటేనే తెలుస్తుందన్నది వేరే విషయము.
--
సెలవు అంటే ఖర్చు తమిళంలో ఉన్నందున ఆ దరిదాపు ప్రాంతాల్లో ఆ అర్థములో కూడా వాడుతుంటారు.
శెలవు అనే రూపం నిఘంటువులో లేదు. మరింత సరిగ్గా వ్రాస్తామనుకుంటూ శె వాడుతుంటామనుకుంటా.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి