ఢిల్లీలోని ఒక శ్రీరామ్ కళాశాల లో రాహుల్ కి బదులుగా శ్రీ నరేంద్రమోడీ గారిని విద్యార్థులు ప్రసంగించడానికి ఎంచుకున్నారంట.వారు ఏ సొల్లు కబుర్లు లేకుండా, యువతరాన్ని స్ఫూర్తితో నింపే విధంగా ప్రసంగించారు.
శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం సారమున్న ప్రసంగం. ప్రతి మాట ఉపయోగకరమైనది. పనిచేసే పనిచేసే,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ముందుకు అడుగులేయించే ఇలాంటి నాయకులు ప్రతిచోటా ఉండాలి.
సబ్సిడీల భిక్ష రెండు రోజులు వేసి మూడోరోజు చేతులెత్తేసేవాళ్ళు కాదు.
http://www.youtube.com/watch?v=0xTkKB3oNb4
ఈరోజు అందరూ గుజరాత్ గురించి మాట్లాడుతున్నారంటే దాని వెనుక మా అందరి కృషి ఇది అని , మా ఆలోచన విధానం ఇట్లా ఉంది అని చెపుతూ వచ్చారు.
గుజరాత్ లో విశ్వవిద్యాలయాల సంఖ్య పెరిగింది. అది ఎట్లా అంటే.....ఊరికే సంఖ్య పెరగడం కాదు.
రక్షకభటుల నియామకాల్లో పొడవు, వెడల్పు, ఇంకా కొన్ని పరీక్షల ద్వారా కాకుండా మొత్తం ఆటిట్యూడ్ పెంపొందించేటట్లు గా అభ్యర్థుల్లో ఉండాలని గుజరాత్ లోవిశ్వవిద్యాలయం ఉంది. పదో తరగతి అయినప్పుడే అక్కడ చేరి పూర్తి ఐదేళ్ళ కోర్స్ అక్కడ చేయవచ్చు. చట్టానికి సంబంధించిన విషయాలతో సహా పోలీస్ నియామకానికి సంబంధించిన చదువు చదవవచ్చు. ఎంతో గొప్ప విషయము.
ఇంకా విద్యాబోధనకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయము, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడినపుడు ఎంత అథారిటీ తో మాట్లాడినారో, విజన్ తో మాట్లాడినారో విని తీరాల్సిందే.
మనది బీద దేశం కాదు. మనకు ఉన్న వనరులు మనం సక్రమంగా వాడుకోవాలని, ప్రతి కార్యక్రమము ప్రో పబ్లిక్ గా ఎట్లా ఉండాలో, గుడ్ గవర్నెన్స్ విజన్ ఎట్ల ఉండాలో చెప్పినారు.
ఒక ట్రైబల్ మనిషి ఆలోచన కూడా ఎంత వైవిధ్యంగా, నూతనంగా ఉండగలదో ఉదాహరణతో చూపించినారు.
ఒక గ్రామంలోని ఒక నిరక్షరాస్యుడు ఎంత ఆత్మవిశ్వాసంతో తన గ్రామానికి అతిథిగా వచ్చిన క్లింటన్ తో ఇంకా మా దేశాన్ని మీరు పాతకాలపు వెనుకబడ్డ దేశంగా భావిస్తున్నారా అని మాట్లాడిన విషయాన్ని
సంతోషంగా ఉదహరించారు.
ఆఫ్ఘనిస్తాన్ లో టమాటాలు, మీ ఢిల్లీలోని చాయ్ తాగితే పాలు, ఢిల్లీ లోని మెట్రో ట్రైన్ లో కోచ్ లతో సహా గుజరాత్ నుంచి మేము పంపుతున్నామన్నారు.
మనం అభివృద్ధి చెందాలంటే స్కిల్, స్కేల్, స్పీడ్ మూడు విషయాలపై రాజీ పడకూడదన్నారు.
స్కిల్ లో జీరో డిఫెక్ట్, స్కేల్ లార్జ్ స్కేల్, స్పీడ్ అంటే సమయాన్ని వృథా చేయరాదు.
పదహైదేళ్ళక్రింద తైవాన్ కి పోయినప్పుడు (ఇంకా ముఖ్యమంత్రికాకముందే) ఒక ద్విభాషి (ఇంటర్ప్రెటేటర్) మోడీ గారిని అడిగారట. ఇంకా భారతము పాములు పట్టే స్థాయిలోనే, (మూఢనమ్మకాల స్థాయిలోనే) ఉందా అని.
మోడీ గారి జవాబు
"అబ్బే ఇప్పుడు అంత స్థాయి కూడా మాకు లేదు. మేము ఇప్పుడు ఎలుకలు పట్టే స్థాయిలోనే ఉన్నాము.
అంటే మౌస్ లు పట్టే స్థాయి. మౌస్ లు పట్టి న మా యువజాతి ఇరవై ముప్ఫైల్లో ఉన్న మా భారతీయులు మౌస్ పట్టి ప్రపంచంలో భారతదేశమంటే ఏమిటన్నది నిరూపించారు. మీరు చేసినారా పని. ఏ రాజకీయనాయకుడూ భారతమాతకు తేని ఖ్యాతి మీ యువతరం తీసుకొచ్చింది. " అన్నారు.
సగం నీటితోనూ , సగం గాలితోనూనిండి ఉంది , కాబట్టి పూర్తి లోటా నిండి ఉన్నదని చెప్పిన శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం సారమున్న ప్రసంగం. ప్రతి మాట ఉపయోగకరమైనది. మాటల్లో చమత్కారాలకూ లోటు లేదు. పనిచేసే,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ముందుకు అడుగులేయించే ఇలాంటి నాయకులు ప్రతిచోటా ఉండాలి.
సబ్సిడీల భిక్ష రెండు రోజులు వేసి మూడోరోజు చేతులెత్తేసేవాళ్ళు కాదు.
అంత నిమగ్నమై మాట్లాడుతూ కూడా అరగంటకే ఇచ్చిన సమయం ముగిసిందా అని చూసుకోవడం, సమగ్ర అభివృద్ధి గురించి, ఈ దేశపు వనరుల గురించి, మానవ వనరుల గురించి అంత నమ్మకంగా, గౌరవముంచి నిరూపించి మాట్లాడే రాజకీయనాయకులున్నారా? మామూలు మనుషులు కూడా ఇది ఇండియా అని తేలికగా మాట్లాడుతారు. మోడీ గారికి నమస్కారములు.
"గోదారి" అనే బ్లాగ్ లోనేనీ రోజు ఈ ప్రసంగం లంకె చూసి పూర్తి ప్రసంగం విన్నాను. వారికి నాకృతజ్ఞతలు.