కంచి కామాక్షి అమ్మవారిని దర్శించేందుకు కంచికి వెళ్ళాం. అక్కడ తెలిసింది ప్రతి ఉదయం ముందు గోపూజ జరిగినతర్వాతే నిత్యపూజలు జరుగుతాయని. ఎంతో సంతోషం కలిగింది. గోపూజ చూడటం కోసం మరు నాడు తెల్లవారుజామున అయిదు గంటలకల్లా గుడిలో ఉన్నాము. ప్రతిరోజు అయిదు గంటలకు గోపూజ జరుగుతుందని, కాపలా వాళ్ళు చెప్పటంతో ఆ సమయానికల్లా అక్కడున్నాము.
ఆవరణలో కూర్చుని వేచియున్నాము. మేమే అనుకుంటే సుమారుగా ఒక యాభై మందిదాకా వచ్చారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అంతా ఉన్నారు. నేను లలితా సహస్రనామాలు చదువుకుంటూ కూర్చున్నాను. పూజారిగారు అప్పుడే వచ్చారు. లోపలికెళ్ళి అమ్మవారి వద్ద దీపం వెలిగించే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక (ఒక పదినిముషాలలో) అందర్నీ పిలిచారు.
కామాక్షీదేవి గర్భాలయం ముందు ఉన్న ప్రదేశంలో క్యూ కోసం పెట్టిన ఇనుప రాడ్లను తొలగించి ఉంచారు. అక్కడే ఎదురుగా ఉన్న ఎత్తైన మండపంలో మేమంతా నించుని చూస్తూఉన్నాము. గోమాత, దూడతో సహా గోపాలకుడు వచ్చాడు.
సరిగ్గా గర్భాలయం ఎదురుగా, అమ్మవారి ఎదురుగా గోమాత పృష్ఠభాగం ఉండేలా నించోబెట్టారు. పూజారిగారు గోమాత తోకకు , ప్రక్కలకు, ముఖానికి పసుపు , గంధం రాసి కుంకుమ అలంకరించారు. పువ్వులు జల్లారు.
అమ్మవారికి, గోమాతకు హారతి ఇచ్చారు. అరటి పళ్ళు గోపాలకునికి ఇవ్వగా అతను గోమాతకు తినిపించాడు. క్రితం రోజే మేము అరటి పళ్ళు కొని సిద్ధం గా ఉంచుకున్నాము. మా చేతిలో నుంచి కూడా పూజారిగారు పళ్ళు అందుకొని గోపాలకునికి ఇచ్చారు. మా జన్మ ధన్యమైనట్టుగా మేము భావించి సంతోషించాము.
ఇంతవరకూ ఇంత వివరంగా గోపూజ, అదీ గుళ్ళో, అదీ క్షేత్రంలో చూడలేదు. మా గృహప్రవేశానికి గోపూజ చేశాం కానీ, అప్పుడు హడావిడిలో ఏం చేశామో, ఎలా చేశామో తెలీదు. కానీ ఇప్పుడు గురువుగారి ప్రవచనాల్లో గోమాత ప్రాముఖ్యత, ప్రశస్తి తెలిశాక గోపూజ తిలకించటం మహదానందంగా ఉన్నది.
గోపూజ జరుగుతున్నప్పుడు దూడకు ఒక గిన్నెలో ఏదో పెట్టారు. అది తింటూ ఉన్నది. ఈ పూజ ముగించి పూజారి గారు గోమాతకు ప్రణిపాతం(సాష్టాంగ నమస్కారం) చేశారు. తర్వాత గోపాలకుడు గోమాతను, దూడను తీసికెళ్ళి పోయాడు.
తర్వాత అమ్మవారి అభిషేకం కన్నులపండుగగా జరిగింది. అలా ఎదురుగా నుంచుని అభిషేకం చూస్తూ, లలితాష్టోత్తరం చదువుకోవటం నా మహద్భాగ్యం.
చాలా చక్కగా చెప్పారు. మీ రచన ద్వారా నాకు మళ్ళీ చూసిన అనుభూతి కలుగుతోంది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇంచుమించు నెలకి ఒకసారి అన్నా వెళ్ళి వచ్చేదానిని.
రిప్లయితొలగించండిరసజ్ఞ గారు, ధన్యవాదాలండీ.
రిప్లయితొలగించండికామాక్షి కొలువున్న ఊళ్ళో చదువుకున్నారా! చాలా సంతోషం. కామాక్షి మూకశంకరుల వారిని అనుగ్రహించి వారిచే మూకపంచశతి ని లోకాలకు అందించటం గురించి విన్నాను. మిమ్మల్నీ అనుగ్రహించిందన్నమాట అమ్మవారు. నిజంగా చెపుతున్నానండీ.
ఫోటోలేమైనా ఉంటే పెట్టరూ?
రిప్లయితొలగించండిమీ ఆసక్తికి సంతోషం. గుళ్ళో ఫోటోలు తీయటం నిషిద్ధమండీ.
రిప్లయితొలగించండినేను అక్కడే హాస్టల్ లో ఉన్నాను కాని ఎప్పుడు వెళ్ళలేదు. చక్కగా వివరించారు. చాల సంతోషం.
రిప్లయితొలగించండిఅక్కడ చూడటానికి చాల గుళ్ళు ఉన్నాయి. మేమైతే వైకుంట పేరుమల్ కోయల్ పక్కనే ఉండేవాళ్ళం ఫైనల్ ఇయర్ లో .
మాకూ అక్కడికి వెళ్ళేవరకూ తెలియదండి.
రిప్లయితొలగించండిఅందుకే నలుగురికీ తెలియాలన్న ఉద్దేశ్యంతోనే వ్రాశాను. మన సంప్రదాయంలో గోమాతకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో, పరదేవతతో సమానమై పూజలందుకుంటుందో తెలపాలన్న ఉద్దేశ్యంతో వ్రాశాను.
మీకు ధన్యవాదాలు.
గోపూజ గురించిన ఈ టపా చదవటం కూడా మా అదృష్టమేనండీ ... ఇలా కొన్ని చోట్లనైనా ఇంత బాగా గోపూజ జరుగుతోందంటే అది ఆ పరమేశ్వరుడి కృపనే ... ధన్యవాదాలు
రిప్లయితొలగించండికళ్యాణ్ గారు, సంతోషమండి.
రిప్లయితొలగించండిగోపూజ మాహాత్మ్యం గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సి ఉంది.
కంది శంకరయ్య మాస్టారి బ్లాగులో మీ తేనె పూరణలు చాలా బాగున్నాయి
రిప్లయితొలగించండికొత్తపాళీ గారు,
రిప్లయితొలగించండిచాలా సంతోషమండీ. మీలాంటి చదువరులు, లేఖరులు మెచ్చుకోవడం సంతోషం.
!! మందాకిని !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి