Loading...

17, డిసెంబర్ 2012, సోమవారం

శృంగేరి గురువుల అనుగ్రహ భాషణము

        
                             
 ఈ మధ్య భాగ్యనగరానికి ఇరవయ్యేళ్ళ తరువాత వేంచేసి భక్తులను అనుగ్రహించిన స్వామి అనగా శృంగేరీ మఠపీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్థానంలో ఉన్నవారికి నగర వాస్తవ్యులు గురువందన కార్యక్రమం చేసిన సందర్భంగా స్వామి వారు జగత్తుకు ఇచ్చిన సందేశము ఎంతో స్ఫూర్తిదాయకమైనది.

                             వారు చెప్పినది ఏమంటే ఎప్పుడైనా ప్రపంచాన్ని నడిపించేది ధర్మము. ఎవరి ధర్మాన్ని వారు తెలుసుకొని చక్కగా పాటించుట మంచిది. ధర్మము అంటే ఏమి అనగా నీ తల్లిదండ్రులను సేవించి వారి ఋణం తీర్చుకో, పరులకు చేతనైనంతలో సహాయపడు, నీవలన ఇంకొకరికి కష్టము కలుగకుండా చూసుకో మని చెప్పినారు.
                          ఎంతో మంచి మాటలు. ఈ మాటలు ఎవరైనా సరిగ్గా అర్థము చేసుకున్నారంటే, అందరూ మనసా పాటించినారంటే ప్రపంచశాంతి ఎందుకు రాదు? తప్పని సరిగా వస్తుంది. నిలిచి ఉంటుంది. ఇంక సంధ్యావందనము చేయుటకు గాయత్రీ మాత అనుమతి తీసుకున్నవారు తప్పని సరిగా సంధ్యావందనము చేయుట మాని వేసి మాకు ఈ కాలానికి, ఈ వేగానికి తగినట్టుగా ఏదైనా సూచించమని కోరుతున్నట్టు వారు చెప్పి, ఒక ప్రశ్న వేసినారు.

                     ఎప్పుడైనా భగవదారాధనలో ప్రతివారూ కూడా తమతమ శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా చేయమనే మన సనాతనధర్మము చెపుతున్నది కానీ ఈ స్థాయిలో చేస్తేనే చేసినట్టు అని ఎప్పుడూ చెప్పలేదు. అట్లాంటపుడు మీ కాలానికి తగినట్టుగా ఎంత తక్కువసమయము(ఒక్క పదినిముషాలైనా) దొరికితే అందులోనే చేయగల వీలున్నపుడు ఇంకా మార్చమని మీరు ఎందుకు అడుగుతున్నారు? ఇంతకూడా మీకు వీలు లేదని మీరనుకుంటున్నపుడు ఇంకోటి కొత్తగా సూచిస్తే దానికి మాత్రము వీలు కుదురుతుందని ఏమి నమ్మకము? అసలు ఇది మన ధర్మమయినపుడు దీనిని మార్చే అధికారము ఎవరికీ లేదు.

                           అయినా మిగతాఅన్నింటికీ సమయము ఉన్నప్పుడు (మార్నింగ్ వాక్ ఖచ్చితంగా చేయాలని అదీ అరగంట అయినా తప్పదని అన్నపుడు, రూపాన్ని అభివృద్ధి చేసుకునే వ్యాయామాలు చేయాలనుకున్నపుడు...ఇట్లాంటివి) వీటిల్లో బేరాలాడితే మనకే నష్టమని తెలిసికొన్నమనము......
                  ఇన్నీ మనము చేయడానికి మనకు తగినంత శక్తినిచ్చిన భగవంతుని తలచుకోవడానికి సమయము లేదని , వేగవంత జీవితమని సాకులతో బేరాలాడాల్నా? అని ప్రశ్నించారు.

                   వారు చెప్పిన ఏ మాటా తిరుగులేనిదని అనిపించింది. ఎటూ దారిమళ్ళకుండా, క్లుప్తంగా, విషయాలను నొక్కి చెపుతూ వారు ప్రసంగించడం ఎంతో బాగున్నది.

4 కామెంట్‌లు:

  1. మంచి మంచి విషయాలను వినడం, పదే పదే మననం చేసుకోవడం, పదిమందిలో ప్రాచుర్యం చేయడం....... మంచితత్వం. అది మీలో ఉంది. మంచి పోస్ట్ ను అందించారు. హృదయపూర్వక అభినందనలు లక్ష్మీదేవి గారు.

    రిప్లయితొలగించండి
  2. please visit www.cpbrown.org and look for "jaateeya sthaayi padya, geya mariyu naataka rachanala poteelu

    రిప్లయితొలగించండి
  3. భారతి గారు,
    ధన్యవాదాలండి. మంచి విషయాలు వ్రాసే మీరు మెచ్చుకొనడం సంతోషకరం.

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాత గారు,
    ధన్యవాదాలండి వివరాలకు. తప్పక చూస్తాను.

    రిప్లయితొలగించండి