కందము-
చిత్తమునాశివు మీదనె
పొత్తిలిలో బిడ్డయట్లు పొందికనిడుమా!
మత్తిలఁజేసెడు నింద్రియ
మిత్తెఱగుననే స్థిరపడ మేలగు నమ్మా!
ఉత్పలమాల-
ఈశ్వరుఁ జింతఁ జేయుటకునే సమయమ్మను నేమమేటి, కీ
నశ్వరమైన దేహమును నమ్ముచు నుండెడు మూర్ఖవాదనల్
విశ్వములెల్ల నిండినవి, వెల్గుల నింపుచు నెల్లెడన్, సదా
యాశ్వసితమ్ముగా జగము లన్నిటి కావగ వేడుదున్ శివా!
సీసము -
నాతికి నిట్టుల నర్మిలి భావము
నింపితె, న్యాయమె నీకు స్వామి?
శీతల పవనము చెంతకు చేరగ
మబ్బుగా కురిసెనె, మమత వాన!
భూతలి కాదది పుష్కల నీరము
కల్గిన సంద్రము! కలసిపోయె!
రాతిగ నీమది రక్తినిఁగోరక
యుండినన్ మేలగు నొప్పికొందు.
ఆటవెలది-
కఱవు వున్న చోట గౌరవమ్ము కలుగు,
వానకైన నెట్టి వఱదకైన!
కడలిలోన కురువ కానరాదు తుదకు,
నానవాలు లేక నంతరించు.
చంపకమాల-
మరి మరి మాయలందుననె మానసమిట్టుల సొక్కుచుండె, నే
చిరుచిరు కంపనమ్ములకొ చిత్రముగా కదలాడు పత్రమై,
సరిగమ తాళమందుకొని చప్పుడు చేయక యాడు పాదమై!
గురువని నమ్ముకొందు నిను, కొంచెము నిశ్చలతత్వమీయరా!
పంచచామరము-
సదా జపించు శక్తినిమ్ము స్వామి, మార్గమందు నా
పదమ్ము తప్పకుండఁ నన్ను పాలనమ్ము సేసి, నీ
పదమ్ముఁ జేర్చుమింక నన్ను, పావనంపు సన్నిధిన్,
మదీయ విన్నపమ్ము నొక్క మారు యాలకించుమా!
మత్తకోకిల-
శ్వేతవర్ణుకు సుందరేశుకు శీతయద్రి నివాసుకున్
పాతకమ్ముల నుండి గాచెడు భస్మధారికి నీశుకున్
నా తపమ్ముల లక్ష్యమౌ భవనాశుకున్ నగధారికిన్
జోతలందును మంగళమ్ములఁ జూచి ఇచ్చెడువానికిన్.
-----లక్ష్మీదేవి.

కవిత బాగుందండి. “బోన్సాయ్” ఒక దారుణమైన ప్రక్రియ. నిషేధించదగిన సోకాల్డ్ కళ అని నా అభిప్రాయం కూడా.
రిప్లయితొలగించండిఇదే అంశం మీద మా ఆఖరి తమ్ముడు విన్నకోట రవిశంకర్ “కుండీలో మర్రిచెట్టు” అనే కవిత 1983 లో వ్రాశాడు. తన కవితల సంకలనానికి కూడా ఇదే పేరు పెట్టాడు. తరవాత ఈ కవిత “ఈమాట” వెబ్ పత్రికలో కూడా వచ్చింది. ఆ లింక్ ఈ క్రింద ఇస్తున్నాను. వీలయితే చూడండి.
కుండీలో మర్రిచెట్టు
http://eemaata.com/em/library/kumdilo/311.html
ధన్యవాదాలండి. ఈ ఆర్ద్రమైన కవితను చదివాను. ఆకాశాలకు పెరిగే చెట్ల స్వత్వాన్ని అంతం చేయడమే ఇది. దీన్ని కళ అనడానికి మనసొప్పదు.
రిప్లయితొలగించండికవితను చదివినందుకు ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండి