అప్పుడప్పుడూ వ్రాసుకున్న పద్యాలలో కొన్నిఉత్పలమాలలు -
ముగ్గురమ్మలు-
వీణను చేతఁ బూని యలివేణిగ బ్రోచిన వాణి రూపమై
పాణిని శూలమున్నిలిపి భక్తుల గాచిన గౌరి రూపమై
రాణిలు తీరుగా ధనపు రాసుల నిచ్చిన లక్ష్మి రూపమై
రాణిగ నిల్చి, యో జనని , రాజిలు భక్తిని నిల్పు నా మదిన్.
ప్రవచనకర్త -
వేదిక పైన నిల్చి సభ విస్మయమంద వచించు శక్తితో
సాదరభావనన్ పరులు సంతసమందగ నుండు భక్తితో
సోదరులంచు నెల్లరకు సూక్తుల నెప్పుడు నేర్పు యుక్తితో
తా దరి జేరు వారలకు ధర్మపు మూర్తిగ నిల్చె నీతడే.
రైతు -
బీటలు వారెనే పుడమి బీదతనంబున రైతులేడ్వగా
మాటలు కాదు సేద్యమును మానక జేయుట నేటి రోజునన్
నాటిన పైరు వచ్చునని నమ్మకమన్నది లేకపోయెనే
చేటగు కాలమే జనుల చింతల బెంచుచునుండెనే హలా!
కవి-
ఎవ్వరు నేర్పిరో మరుల నిట్టుల నద్భుత రీతులందులన్
మువ్వల సవ్వడో యనగ మ్రోవగ జేయుచు జెల్గెనీతడే!
పువ్వుల తావిలో కలము ముంచుచు వ్రాసెనొ! బొండు మల్లెలన్
రువ్వుచు, నిల్పె నిజ్జగము రోయక నుండగ భావుకత్వమున్.
పెళ్ళిలో ఆశీర్వాదము -
యుక్తవయస్కులందరకు యోరిమిఁ దప్పక మున్నె జోడుగా
భక్తినిఁ బంచయజ్ఞములఁ బాలన జేయుమటంచు, వారలన్
ముక్తినిఁ జేర యోగ్యులను ముందుగ జేయు మహోత్సవమ్మిదే!
వ్యక్తముఁ జేయవచ్చితి, వివాహపు తంతు శుభాశయమ్ములన్.
-----లక్ష్మీదేవి.

అన్ని పద్యాలు బాగున్నాయి.
రిప్లయితొలగించండిజాణ అనే పదాన్ని వేరే అర్థం లో అందరూ వాడి వాడి ఇక్కడ ఎందుకో గానీ అంత నచ్చలేదు. క్షోణిని నిల్చితే అంటే ఓకే నా?
మీ సూచన బాగుంది. కానీ క్షోణి అంటే భూమి మాత్రమే కదా. విశ్వానికంతా పాలకురాలు అని రాణిగా మార్చాను. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపైగా యతి కూడా కుదరదు. అందుకే ఇలా మార్చా.
రిప్లయితొలగించండి