మంగళదాయిని మా గౌరి
జంగమరాయని శ్రీ గౌరి
సింగముపై కొలువై యుండే
బంగరు తల్లీ, మముఁ గనుమా!
త్రుంచగ లోభము, మోహము తొలగగ..
సంచిత కర్మల సంగము విడువగ..
మంచీ చెడులూ నిండిన జగమున
నెంచి మసలుకొను తెలివిడి నిడుమా! ॥ మం॥
కంటికి కనపడు కాయము కతమున
నంటును పాపము పుణ్యములన్నియు..
కంటకమగునవి మోక్షపు దారుల
నొంటరిగా విడ నొల్లకు మమ్మా!
* * *
హంసగామిని రాక; ప్రకృతికి వేడుక ; మందాకినీ తూలిక; భక్తి గీత వేదిక -
రిప్లయితొలగించండిమంగళ దాయిని గౌరిని వర్ణించిన
శైలి, లయ చాలా బాగున్నవి లక్ష్మి గారూ!
హంసగామిని రాక; ప్రకృతికి వేడుక ;
రిప్లయితొలగించండిమందాకినీ తూలిక; భక్తి గీత వేదిక -
మంగళ్దాయిని గౌరిని వర్ణించిన శైలి, లయ చాలా బాగున్నవి లక్ష్మి గారూ!
కాదంబరి గారూ,
రిప్లయితొలగించండిమీ ఆత్మీయమైన పలకరింపు, అభినందన చాలా బాగా అనిపించిందండీ, పవన వీచిక లాగా ఆహ్లాదంగా.
Thank you lakshmi gaaruu! -
రిప్లయితొలగించండిkusumaamba 1955