భువనేశ్వరీ !
అఖిల లోకములఁ గన్న తల్లివీ,
ఆశీస్సులనే కోరివచ్చితిని........... భువనేశ్వరీ!
రాగము ద్వేషము లేని దానవు
లోకములన్నిటి నేలెదవూ..
ద్వేషము పెరుగగఁ బంతముఁ బూనిన
దేశము నిపుడు కావగరావా... భువనేశ్వరీ!
ఎల్లరమూ నీ పిల్లలమమ్మా
చల్లటి నీ ఒడి నుండగ నిమ్మా..
కల్లల,కపటాలన్నిటినీ..
అఖిల లోకములఁ గన్న తల్లివీ,
ఆశీస్సులనే కోరివచ్చితిని........... భువనేశ్వరీ!
రాగము ద్వేషము లేని దానవు
లోకములన్నిటి నేలెదవూ..
ద్వేషము పెరుగగఁ బంతముఁ బూనిన
దేశము నిపుడు కావగరావా... భువనేశ్వరీ!
ఎల్లరమూ నీ పిల్లలమమ్మా
చల్లటి నీ ఒడి నుండగ నిమ్మా..
కల్లల,కపటాలన్నిటినీ..
చెల్లగబోవని చూపగదమ్మా.....భువనేశ్వరీ!
-----లక్ష్మీదేవి
చాలా బాగుంది.విజయ దసమి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిశశికళా! బోల్డు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీకందరికీ దసరా శుభాకాంక్షలు.