శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి
వరలినది ఈ భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా !(2)
వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||
విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||
సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన||
మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||
దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||
పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||
---రాయప్రోలు సుబ్బారావు.
ఈ పాట ఇక్కడ వినండి.